- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Goodachari 2 కొత్త మిషన్‌తో అడవి శేష్ ‘గూఢచారి 2’.. షూటింగ్ స్టార్ట్
దిశ, వెబ్‌డెస్క్: థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్‌లు ఎంచుకుని సూపర్ హిట్‌గా దూసుకుపోతున్న హీరో అడవి శేష్.. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా రూపొందుతున్న ‘గూఢచారి 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేసిన టీమ్.. తాజాగా షూటింగ్ స్టార్ట్ చేశారు.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నేడు షూటింగ్ ప్రారంభించిన సందర్భంగా అడవి శేష్ ఫొటో, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫొటో షేర్ చేస్తూ.. ‘మన ఏజెంట్ 116 మళ్లీ వచ్చాడు. ఈ సారి త్రినేత్ర అనే కొత్త మిషన్‌తో వస్తున్నాడు. ఎంతో మంది వెయిట్ చేస్తున్న స్పై సీక్వెల్ గూఢచారి 2 షూటింగ్ ఈరోజు మొదలు పెట్టాము’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
- Tags
- Goodachari 2