రత్నం లాంటి చిత్రాన్ని అమ్మతో కలిసి చూడండి: అదితి రావు స్వీట్ నోట్

by sudharani |   ( Updated:2022-09-12 11:45:48.0  )
రత్నం లాంటి చిత్రాన్ని అమ్మతో కలిసి చూడండి: అదితి రావు స్వీట్ నోట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో శర్వానంద్‌, అక్కినేని అమల ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని త‌ల్లీకొడుకుల మధ్య ప్రేమానుబంధాలు, టైం ట్రావెల్ నేప‌థ్యంలో శ్రీ‌కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. సెలబ్రిటీలు, ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అందాల తార అదితి రావు హైదరీ మూవీని పొగిడేస్తూ బ్యూటీఫుల్ నోట్ షేర్ చేసింది.'నాకు కన్నీళ్లు తెప్పించి.. నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు. ఈ విశ్వంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి ఓ సినిమా తీసినందుకు థ్యాంక్యూ. అమ్మలు నిజంగా ఈ ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తారు. మీ అమ్మలను తీసుకెళ్లి రత్నం లాంటి ఈ చిత్రాన్ని చూడండి' అంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరింది.

Advertisement

Next Story

Most Viewed