- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adipurush పోస్టర్‌పై కాపీ రైట్.. మా పనిని కాపీ చేశారన్న యానిమేషన్ స్టూడియో..
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టీజర్ పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఆదిపురుష్ నుంచి వచ్చిన ప్రభాస్ పోస్టర్‌పై ఓ యానిమేషన్ సంస్థ కాపీ రైట్ ఇష్యూ చేసింది. మూవీ మేకర్స్ తమ పనిని కాపీ కొట్టారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ యానిమేషన్ సంస్థ వానర సేన స్టూడియోస్ ఈ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో స్టూడియో వారు తాము సిద్ధం చేసిన శివుడి పోస్టర్‌ను, ఆదిపురుష్ పోస్టర్‌ను పక్కపక్కన పెట్టి ఓ పోస్ట్ చేశారు.
అంతేకాకుండా మూవీ మేకర్స్ తమకు కనీసం క్రెడిట్ అయినా ఇచ్చుండాలని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సిగ్గుచేటు. టీ సిరీస్ కనీసం ఈ పోస్టర్ ఒరిజినల్ క్రియేటర్‌ను మెన్షన్ చేసిండాల్సింది' అని యానిమేషన్ స్టూడియో వారు తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. ఇది దారుణమైన కాపీ అని, కేవలం కాపీ పేస్ట్ చేసేశారని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ అద్భుతంగా ఉన్నాడని, ఆదిపురుష్ టీజర్లో కన్నా బాహుబలి మూవీలో ప్రభాస్ శ్రీరామునిలా ఉన్నాడంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీ సిరీస్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. మరి త్వరలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- Tags
- Adipurush