యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘ఆదిపురుష్’ జై శ్రీరామ్..

by sudharani |
యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘ఆదిపురుష్’ జై శ్రీరామ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘ఆదిపురుష్’. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా.. ఈ సినిమాలోని ‘జై శ్రీరామ్’ సాంగ్ నిన్న(మే-20) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన అతి తక్కువ సమయంలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రిలీజైన 20 గంటల్లోనే ‘జై శ్రీరామ్’ సాంగ్‌కు హిందీలో 31M, తెలుగులో 6.5 M వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డు సృష్టించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story