పఠాన్ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తున్న ఆదిపురుష్

by Anjali |   ( Updated:2023-06-14 10:13:47.0  )
పఠాన్ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తున్న ఆదిపురుష్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఈ మూవీపై ప్రేక్షులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్‌ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రెండు లక్షల డాలర్లు గ్రాస్ వచ్చింది. ముందుగా నార్త్ ఇండియా బెల్ట్ బుకింగ్స్‌ని ప్రారంభించగా, అక్కడ ఈ సినిమా ప్రారంభం నుండే అద్భుతాలు సృష్టిస్తుంది. పీవీఆర్ ముల్టీప్లెక్స్ చైన్స్‌లో ఇప్పటి వరకు పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ స్థాయిలో టికెట్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘పఠాన్’ కి కూడా ఇంతగా అమ్ముడుపోలేదట. మొదటి రోజు 3 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో ‘ఆదిపురుష్’ ఒక్క రోజుకే 10వేల టికెట్స్‌కు పైగా అమ్ముడుపోవడంతో పఠాన్ చిత్రాన్ని కూడా బ్రేక్ చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట దీని గురించే చర్చ జరుగుతోంది. అలాగే బాహుబలి రికార్డ్ కూడా బ్రేక్ అవుతుందని చాలా మంది వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన రాజశేఖర్ డాటర్.. పిక్స్ వైరల్

Advertisement

Next Story