- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదిపురుష్ ఎఫెక్ట్.. అక్కడ భారతీయ సినిమాలపై నిషేధం!
దిశ, వెబ్‌డెస్క్: రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘‘ఆదిపురుష్’’ చిత్రం ఎంతగా ట్రోల్స్‌కు గురవుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రామాయణం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కొన్ని సీన్స్ హిందూవుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ హిందూ సంఘాలు, ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో సీత భారత్‌లో పుట్టినట్లు చూపిండంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మూవీలో సీత భారత్‌లో పుట్టినట్లు ఉన్న ఆ డైలాగ్‌ను మార్చాలని నేపాల్ రాజధాని ఖాట్మండు నగర మేయర్ బలెన్‌షా డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు చిత్రం బృందం ఆ డైలాగ్‌ను చేంజ్ చేయకపోవడంతో తాజాగా ఆయన స్పందించి.. నేటి(జూన్ 19) నుంచి ఖాట్మండులో ‘ఆదిపురుష్’తో సహా ఇతర భారతీయ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: కాజల్ పుట్టిన రోజు సందర్భంగా తన 60వ సినిమా అనౌన్స్..