నన్ను, నా డబ్బును వాడుకుని నా తల్లిని చంపేశాడు.. భర్త ఆదిల్ ఖాన్ దురానీపై రాఖీ సావంత్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-08-11 09:25:10.0  )
నన్ను, నా డబ్బును వాడుకుని నా తల్లిని చంపేశాడు..  భర్త ఆదిల్ ఖాన్ దురానీపై రాఖీ సావంత్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటి రాఖీ సావంత్, ఆమె భర్త ఆదిల్ ఖాన్‌ దురానీకి సంబంధించి వార్తలు రోజు రోజుకూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా ఆదిల్ తనతో విడిపోతున్నట్లు చెప్పాడంటూ రాఖీ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ''మొత్తానికి ఆదిల్ నన్ను వదిలేయాలనుకున్నాడు. 'నిన్ను వదిలి. నేను తన దగ్గరకు వెళ్తాను. ఆమెతోనే ఉంటాను'అని చెప్పాడు. అతను బాలీవుడ్‌లో ఎంట్రీ కోసమే నన్ను వాడుకున్నాడు. నా డబ్బంతా తీసుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. నన్ను ఎమోషనల్‌గా, మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశాడు. నాకు పెళ్లి తర్వాత తెలిసిన మరో విషయం ఏంటంటే.. అతడి‌పై మైసూర్‌‌లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. మా అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో బాధపడుతున్న సమయంలో 'బిగ్‌బాస్' మరాఠీ షోలో పాల్గొన్నందుకు నాకు వచ్చిన రూ.10 లక్షల చెక్‌ను ఆదిల్ చేతిలో పెట్టాను. కానీ ఆ డబ్బును అతడు మా అమ్మ చికిత్స కోసం ఉపయోగించలేదు. మా అమ్మ సర్జరీ కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టి ఉంటే గనుక.. మా ఇప్పటికీ బతికి ఉండేది. ఆదిల్ ఖాన్ దురానీ వల్లే నా తల్లి మరణించింది. నా డబ్బు కోసమే ఆదిల్ నా వెంట పడ్డాడు. నన్ను వాడుకున్నాడు'' అని చెప్పుకొచ్చింది రాఖీ.

Advertisement

Next Story