ఒంటినిండా గాయాలతో దేశ సరిహద్దులో హీరోయిన్..! ఫొటోస్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-02 06:38:16.0  )
ఒంటినిండా గాయాలతో దేశ సరిహద్దులో హీరోయిన్..! ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆదా శర్మ ‘హార్ట్‌ఎటాక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. మే 5న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం రూ. 230 కోట్ల మేర వసూల్ చేసి బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టిస్తోంది. ఊహించని సక్సెస్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్న ఆదా శర్మ సినిమా కోసం ఎంత కష్టపడిందో తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. కేరళ స్టోరీ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘‘ మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నాం. డీహైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. ఫొటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దామనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం.. కష్టానికి ప్రతిఫలం లభించింది. అందుకు ఆనందంగా ఉంది’’ అంటూ ముఖం గాయాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

Read More... డైరెక్టర్‌తో కలిసి ఆ హీరో అందరి ముందే అలా చేశాడు..పుస్తకంలో అలా రాసుకున్న నటి!

Advertisement

Next Story