మొదలైన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ షూటింగ్.. ఆదాశర్మ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-20 14:40:01.0  )
మొదలైన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ షూటింగ్.. ఆదాశర్మ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ టీమ్ మరో కాంట్రవర్సీ స్టోరీని తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నో వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటూనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కేరళ స్టోరీ నేపథ్యంలోనే ‘బస్తర్’ ది నక్సల్ స్టోరీ.. అనే ట్యాగ్ లైన్‌తో మూవీని రూపొందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఇక సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ షా నిర్మించనున్న ఈ మూవీలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆదా శర్మ ‘‘ది కేరళ స్టోరీ’లో నేను పోషించిన షాలినీ క్యారెక్టర్‌ను ఎలా ఆదరించారో.. ఇందులోనూ నీర్జా మాధవన్ పాత్రను కూడా ప్రేమిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవి కూడా చదవండి : విక్రమ్‌ ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్.. ‘కేజీఎఫ్‌’ లింక్‌తో చియాన్ కొత్త సినిమా

Advertisement

Next Story