తనను ఎంతో ప్రేమించా.. కారణం చెప్పకుండానే బ్రేకప్ చెప్పాడు.. స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసిన నటి

by sudharani |   ( Updated:2023-11-02 17:49:30.0  )
తనను ఎంతో ప్రేమించా.. కారణం చెప్పకుండానే బ్రేకప్ చెప్పాడు.. స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసిన నటి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు, దివంగత హీరో సుశాంత్ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అతని మొదటి ప్రియురాలు. సినిమాలపై ఉన్న ఇష్టంతో.. కెరీర్ స్టార్టింగ్‌లో పలు సీరియల్స్‌లో నటించాడు సుశాంత్. ఆ టైంలో అంకితా లోఖండేతో కలిసి ఓ సీరియల్ చేశాడు. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సుశాంత్, అంకిత ఎందుకు విడిపోయారో తెలియదు. అయితే.. దీనిపై తాజాగా స్పందించింది నటి అంకిత.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. మొదట అతడు విడిపోదాం అన్నప్పుడు షాక్ అయ్యా. అతడు బ్రేకప్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ, సుశాంత్ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ తప్పు పట్టాలని అనుకోలేదు. అతడి నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ తర్వాత వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లడానికి కూడా భయపడ్డా. అతడిని నేను ఎంతగానో ప్రేమించా. ఎదుటి వాళ్ల మాటలు విని అతడు నా నుంచి విడిపోయి ఉంటాడు’ అంటూ మొదటి సారి సుశాంత్‌తో తన బ్రేకప్‌పై స్పందించింది అంకిత.

Advertisement

Next Story