వాల్తేరు వీరయ్య మూవీ టీమ్‌కు మరో షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శృతి హాసన్ దూరం!

by Satheesh |   ( Updated:2023-01-08 14:07:58.0  )
వాల్తేరు వీరయ్య మూవీ టీమ్‌కు మరో షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శృతి హాసన్ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుకున్న ఈ చిత్రం జనవరి 13వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో మూవీ యూనిట్ ఇవాళ వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇప్పటికే హీరో చిరంజీవి వైజాగ్ చేరుకోగా.. హీరోయిన్ శృతి హాసన్ ఈ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు. అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఈ హాట్ బ్యూటీ దూరమైంది.

అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోతున్నానని శృతి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌ను చాలా మిస్ అవుతున్నానని ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది నటి శృతి హాసన్. ఇదిలా ఉంటే, వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. శనివారం ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం చేయగా పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో ఈవెంట్‌ను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు మార్చారు. అది అలా ఉంటే, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోతున్నానని హీరోయిన్ శృతి హాసన్ మరో షాకిచ్చింది.

Advertisement

Next Story