ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఏడుస్తూ కనిపించిన నటి (వీడియో)

by Mahesh |   ( Updated:2023-03-27 13:00:50.0  )
ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఏడుస్తూ కనిపించిన నటి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భోజ్‌పురి యువ నటి ఆకాంక్ష ఈ రోజు వారణాసి‌లోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్యచేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఆమె హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది గంటల ముందు ఇన్ స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఏడుస్తూ కనిపించింది. కాగా ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు. 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. లైవ్ ఆమె అలా ఎందుకు ఏడుస్తూ కనిపించిందో అప్పుడు వారికి అర్థం కాలేదు. కానీ కొద్దిగంటల తర్వాత ఆమె తన చిత్రం యూనిట్‌తో కలిసి బస చేసిన హోటలో గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story