Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసమే ఆ పాత్ర చేశాను.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసమే ఆ పాత్ర చేశాను.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సోషియా ఫాంటసీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుండగా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. అంతే కాకుండా ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ఓ నటి. ఆమె మరెవరో కాదు.. విశ్వంభర సినిమాలో చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్‌లో చేస్తున్న రమ్య పసుపులేటి.

రమ్య పసుపులేటి సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుని ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇస్తుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వంభర మూవీ గురించి ఆసక్తిర కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ‘‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి పక్కన చెల్లెలుగా చేస్తున్నారు. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ అవేవి నేను ఒప్పుకోలేదు. హీరోయిన్‌గానే ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాను. కానీ మెగాస్టార్ పక్కన చేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. అందుకే చెల్లెలు క్యారెక్టర్ అయినా సరే ఓకే చెప్పేశాను. అంతే కాదు.. ఆయనతో చాలా సేపు స్క్రీన్‌లో కనిపిస్తాను. నాతో పాటు మరో హీరోయిన్ కూడా చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ రమ్య కామెంట్స్ వైరల్ కావడంతో.. ‘భోళ శంకర్’ సినిమా కూడా చెల్లెలు సెంటిమెంట్‌తోనే తిశారు. కానీ అంతగా హిట్ అందుకోలేక పోయింది. ఇప్పుడు మరోసారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story