‘రెండు నెలలు కమిట్మెంట్ అడిగాడు’ టాలీవుడ్ దర్శకుడిపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Anjali |
‘రెండు నెలలు కమిట్మెంట్ అడిగాడు’ టాలీవుడ్ దర్శకుడిపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కునే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు మీడియా ముందుకొచ్చి.. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి మితా వశిస్ట్ కాస్టింగ్ కౌట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘కాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉందని తెలిపింది. హీరోయిన్లకు లైన్ లో పెట్టడానికి ట్రై చేయడం అనే సంస్కృతిని నేను ఇక్కడే చూశానని, ఎంతోమంది ఆడవాళ్లు ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారవారేనని చెప్పుకొచ్చింది.

కొంతమంది కమిట్మెంట్ విషయంలో ఎదురుచెప్పి, ధైర్యంగా మాట్లాడిన వారికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు. నన్ను కూడా ఒక టాలీవుడ్ దర్శకుడు కమిట్మెంట్ అడిగాడని, నాకు ఫోన్ చేసి చెన్నైలోకలిసి లీడ్ రూల్‌లో అవకాశం ఇచ్చాడని తెలిపింది. కానీ అతడితో రెండు నెలలు కలిసి ఉండాలని కండిషన్ పెట్టారని పేర్కొంది. ఫస్ట్ తన మాటలు అర్థం కాలేదని, తర్వాత మెల్లిగా అర్థం చేసుకుని బుల్‌షిట్.. నాకు ఎలాంటి రోల్ వద్దు.నాకు మరో థాట్ కూడా లేదని చెప్పేశానని వెల్లడించింది.

Advertisement

Next Story