- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రొడ్యూసర్‌తో కమిట్ అయ్యాననుకుని పెళ్లి చేశారు: స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించి.. ఇండస్ట్రీకి దూరమయ్యారు నటి కస్తూరి శంకర్. పరిశ్రమలో హీరోయిన్‌గా చాలా తక్కువ కాలం కొనసాగించినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్లో తులసి పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ నటి మరోవైపు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలతో పాట సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
-తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘‘నేను హీరోయిన్‌గా నటిస్తోన్న సమయంలో ఓ ప్రొడ్యూసర్‌తో కమిట్ అయ్యాను అని ఓ డర్టీ రూమర్ వచ్చింది. దీంతో మా నాన్న చాలా భయపడ్డారు. ఇలాంటి రూమర్ వస్తే తర్వాత నీ వివాహం చేయడం చాలా కష్టం అవుతుంది. నీకు పెళ్లి చేసే బాధ్యత మాపై ఉంది. అందుకే పెళ్లి చేసుకో అని బలవంతం చేశారు. ఇక వెంటనే నాకు పెళ్లి చేసేశారు. కాగా 23 ఏళ్లకే నా పెళ్లి జరిగింది. వివాహనంతరం నేను వరల్డ్‌లో 25 దేశాలు తిరుగుతూ అన్ని ఎంజాయ్ చేశాను. అలాగే డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశాను’’. అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.