- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెన్షన్.. క్లీన్ చిట్ వస్తేనే సస్పెన్షన్ ఎత్తివేత!
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. తన ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు గురువారం మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లేలు ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తాజాగా ప్రకటించారు. కాగా, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. కానీ తానేమీ తప్పు చేయలేదంటూ హేమ చెప్పుకొచ్చింది.