Krishnam Rju మొదటి వర్ధంతి సందర్భంగా Anushka ఎమోషనల్ పోస్ట్

by Anjali |   ( Updated:2023-09-12 14:33:16.0  )
Krishnam Rju మొదటి వర్ధంతి సందర్భంగా Anushka ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగానూ మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే గతేడాది సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వర్గస్తులై ఏడాది పూర్తైన సందర్భంగా కృష్ణంరాజును గుర్తు చేసుకుంటూ సెలబ్రిటీలంతా భావోద్వేగ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నటి అనుష్కశెట్టి ఆయనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ‘కృష్ణంరాజుగారు మంచి మనసున్న వ్యక్తి. గొప్ప నటుడిగా, మనిషిగా ఆయన పంచిన ప్రేమ, తీపి జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : అనారోగ్యం విషయంలో సమంత కంటే ఎక్కువ నరకం చూశాను: శ్రీ సుధ

Advertisement

Next Story