- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరోయిన్ లయతో పెళ్లి.. ఆ విషయం తెలిసాక చేసుకోలేదంటూ నటుడు ఆసక్తికర కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను మొదట ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రేమించు మూవీతో మంచి విజయం అందుకుని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సాయి కిరణ్ బుల్లితెరపై పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి కిరణ్, లయతో నటించిన ప్రేమించు మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ లయ బ్లైండ్‌గా నటించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ సినిమా నేషనల్ అవార్డు వరకు వెళ్లింది.
నీ జీవితాంతం ఈ సినిమా గుర్తుంటుందని రామానాయుడు అన్నారు. అలాగే లయతో పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. చూడడానికి జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మా జాతకాలు కలవలేదు. అందువల్లే సెట్ అవ్వలేదు. మా మధ్య లవ్ అలాంటివేమీ లేవు. మేము కూడా కుదిరితే చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ఆ తర్వాత ఇంద్రజిత్ అనే షో చేశాం. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఎంత బాగుందో మూవీలో నటించాం. మా తల్లిదండ్రులు జాతకాలు నమ్ముతారు. ఒకప్పుడు నేను కూడా నమ్మే వాడిని వాటి గురించి తెలుసుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి కిరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.