మెగాస్టార్ చిరంజీవిని రెచ్చగొట్టొద్దు: నాగబాబు ఇన్ డైరెక్ట్ వార్నింగ్

by Satheesh |   ( Updated:2022-12-26 16:08:17.0  )
Nagababu
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వినయంగా ఉన్నారని రెచ్చగొడితే.. మెగా ఫ్యాన్స్ తిరగబడుతారని ఆయన సోదరుడు, యాక్టర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాగబాబు మెగా అభిమాన సంఘాలతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి చిరంజీవిపై ఈగ వాలనీయని అభిమానులు ఆయనకు ఉన్నారని అన్నారు. చిరంజీవి పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఓ నేతను చూశామని.. కానీ ఒకప్పడు అదే వ్యక్తి పూలుజల్లి తీసుకెళ్లాడని పేర్కొన్నారు. నీకు రాజ్యాంగం అధికారం ఇచ్చి ఉండొచ్చు.. కానీ చిరంజీవికి కోట్లాది మంది అభిమానముందని అన్నారు. కాగా, నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిన నేత ఎవరా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story