ఆయనతో ఫోటో దిగడానికి పడిగాపులు కాసినోళ్లు కారుకూతలు కూస్తున్నారు.. వైసీపీ నేతలపై నాగబాబు ఫైర్

by Javid Pasha |   ( Updated:2023-08-09 10:49:38.0  )
ఆయనతో ఫోటో దిగడానికి పడిగాపులు కాసినోళ్లు కారుకూతలు కూస్తున్నారు.. వైసీపీ నేతలపై నాగబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పేదోడి కడుపు నింపడం మానేసి చిత్రపరిశ్రమపై పడతారేంటీ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రులు అమర్నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. బుద్ధిగా సినిమాలు చేసుకోకుండా రాజకీయాల గురించి తనకెందుకు అంటూ చిరంజీవిపై విరుచుకుపడ్డారు. తమను విమర్శించడానికి ముందు తమ్ముడు పవన్ కల్యాణ్ కు బుద్ధి చెప్పుకో అంటూ సూచించారు. దీంతో మెగా అభిమానులుల వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ పలు చోట్ల ధర్నాలకు దిగారు.

కాగా ఈ వ్యవహారంపై చిరంజీవి సోదరుడు, జనసేన ముఖ్య నేత నాగబాబు స్పందించారు. ఆయనతో ఫోటో దిగడానికి పడిగాపులు కాసిన వాళ్లు.. ఇవాళ కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం చిమ్ముతున్నారని అన్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే తమ ముఖం మీద పడుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. బటన్ నొక్కితో ఉచితాలు పంచడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. జగన్ దుర్మార్గపు పాలనకు త్వరలోనే ఎండ్ కార్డు తప్పదని అన్నారు. తమ బతుకులకు శాఖల మీద అవగాహన ఉండదని అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదని ఏపీ మంత్రులపై విరుచుకుపడ్డారు.

Read More..

ఏపీకి చిరంజీవి ఏం చేశారు? ఏ అర్హత ఉందని జగన్‌ను కలిశారు?: మంత్రి ఆర్‌కే రోజా ఫైర్

‘ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు’

Advertisement

Next Story