Jamuna Biopic: జమున బయోపిక్‌‌లో తమన్న?

by Mahesh |   ( Updated:2023-01-28 15:09:33.0  )
Jamuna Biopic: జమున బయోపిక్‌‌లో తమన్న?
X

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మహానటి సావిత్రి తర్వాత అదే స్థాయిలో స్థానాన్ని దక్కించుకుంది జమున ఒక్కరే. ఎన్నో అద్భుతమైన పాత్రలు, పలు భాషల్లో మంచి సినిమాల్లో నటించిన జమున జనవరి 27న తుది శ్వాస విడిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. దివంగత నటి జమున సినీ ప్రస్థానం నేటితరం వారికి తెలియడం కోసం బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట ప్రముఖ నిర్మాతలు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఆమె బయోపిక్ తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా జమున క్యారెక్టర్‌లో మిల్క్ బ్యూటీ తమన్నను ఓకే చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story