డైరెక్టర్ Anil Ravipudi పీక మీద కత్తి పెట్టి బెదిరించిన Brahmaji.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-07-23 10:40:16.0  )
డైరెక్టర్ Anil Ravipudi పీక మీద కత్తి పెట్టి బెదిరించిన Brahmaji.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు బ్రహ్మాజీ పలు చిత్రాల్లో కమెడియన్’గా నటించారు. అంతేకాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను అలరించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న బ్రహ్మాజీ.. తనలోని మరో యాంగిల్‌ని చూపించాడు. తన కొడుకు సినిమా కోసం ఏకంగా డైరెక్టర్‌ను కత్తితో బెదిరించాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఈ సినిమా జూలై 29న విడుదల కాబోతుంది.

బ్రహ్మాజీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లాడు. రిలీజ్ డేట్ చెప్పాలని రిక్వెస్ట్ చేశాడు. కానీ, దర్శకుడు చెప్పను పొమ్మనగా, కత్తితో బెదిరించాడు. బ్రహ్మాజీ. దీంతో ఏం చేయలేక అనిల్‌ రావిపూడి శనివారం విడుదల కాబోతున్న సినిమాని చూడాలని తెలిపారు. అయితే ఇదంతా జస్ట్ ఫన్‌, అండ్‌ ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో కావడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Also Read: ‘పలాస’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ మూవీ.. పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిందట!

Advertisement

Next Story