హీరోగా నటించాలంటే నాకు చాలా భయం: సుబ్బరాజు

by Harish |
హీరోగా నటించాలంటే నాకు చాలా భయం: సుబ్బరాజు
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు హీరోలు ఎంతగా గుర్తుంటారో విలన్‌లు కూడా అంతే గుర్తుంటారు. అలా టాలీవుడ్‌లో నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలతో పాటు కామెడీ‌తోనూ విలనిజం చూపించాడు నటుడు సుబ్బరాజు. అయితే తాజాగా ఓ షోలో మాట్లాడుతూ.. 'నేను భీమవరంలో డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అనుకోకుండా నాకు కృష్ణవంశీ 'ఖడ్గం' మూవీలో ఆఫర్ వచ్చింది. నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి నల్లకుంటలోని ఓ రూమ్‌లో ఉండేవాడిని. తర్వాత మెల్లగా ఛాన్స్‌లు వచ్చాయి.

'ఆర్య' మూవీ ఫస్ట్ టైమ్ రూ. 2 లక్షలు పారితోషికం తీసుకున్నా. నా కటౌట్ చూసి చాలామంది హీరోగా ట్రై చేయమన్నారు. నిజం చెప్పాలంటే 'యోగి' సినిమా షూటింగులో నాకు చిన్న ప్రమాదం జరిగింది. దాని కారణంగా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చాను. కానీ, నా దృష్టిలో హీరో పాత్ర అంటే చిన్న విషయం కాదు. సినిమా బాధ్యత మొత్తం హీరో క్యారెక్టర్‌పైన ఆధారపడి ఉంటుంది. అంత పెద్ద బాధ్యత మోయడం అంటే నాకు భయం. అందుకే హీరోగా చేయలేదు' అని తెలిపాడు.

Advertisement

Next Story