ఇది ఎప్పటికీ మరువలేమంటూ అంబానీ వేడుక గురించి.. ఉపాసన ఆసక్తికర పోస్ట్

by Hamsa |   ( Updated:2024-03-05 06:36:53.0  )
ఇది ఎప్పటికీ మరువలేమంటూ అంబానీ వేడుక గురించి.. ఉపాసన ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి నాలుగు నెలల సమయం ఉండగానే వీరు ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంబరాలు గుజరాత్‌లోని జూమ్‌నగర్‌లో జరిగాయి. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ఈ వేడకకు హాజరై సందడి చేశారు. రజనీకాంత్, ఎంఎస్ ధోని, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, వంటి స్టార్స్ పాల్గొన్నారు.

అయితే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. తాజాగా, అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి చెబుతూ.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ అనంత్- రాధిక యావత్ కుటుంబానికి శుభాభినందనలు. ముఖేష్ అంబానీ- నీతా గారు.. మీ ఆతిథ్యాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరేమో.. మీ అద్భుతమైన ఆదరణకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అద్భుతమైన వ్యక్తులతో సమయం అద్భుతంగా గడిచిపోయినందుకు సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ మరువలేం’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read More..

అంబానీ వేడుకల్లో రామ్ చరణ్‌కు ఘోర అవమానం స్టేజ్ దిగిపోయానంటూ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story