ఆ యంగ్ హీరోయిన్ ముస్లింగా కన్వర్ట్ అవుతుందా?

by Sujitha Rachapalli |
ఆ యంగ్ హీరోయిన్ ముస్లింగా కన్వర్ట్ అవుతుందా?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా వివాహ మహోత్సవం జహీర్ ఇక్బాల్ తో జరగబోతుంది. అయితే ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఆ తర్వాత మత మార్పిడి చేసుకుంటుందా అనే అనుమానాలు అభిమానుల్లో వచ్చేశాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో దీనిపై క్లారిటీ ఇచ్చాడు పెళ్లి కొడుకు. వివాహంతో తాము ఇద్దరం ఒక్కటి అవుతామని.. అంతేకానీ ఒకరిపై మరొకరు తమ అభిప్రాయాలు, ఆలోచనలు మార్చుకోవాల్సిన రుద్దుకోవడం లేదన్నాడు. సోనాక్షి తనకు నచ్చినట్లుగానే హిందువుగా ఉండిపోతుందని.. ముస్లింగా మారబోదని స్పష్టం చేశాడు.

ఇక ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాగా హల్దీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరగాలనే విషయంపై రెండు ఫ్యామిలీల మధ్య పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం డిసైడ్ చేశారో ఇప్పటికీ బయటకు రాకపోగా పెళ్లి రోజే తెలిసేలా ఉంది. ఇక సోనాక్షి రీసెంట్ గా ' హీరామండి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed