ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. అంబానీ పెళ్లిలోనే తేల్చేశారు...

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-13 07:28:57.0  )
ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. అంబానీ పెళ్లిలోనే తేల్చేశారు...
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ ఐశ్వర్యా రాయ్.. వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ తో ప్రేమ తర్వాత అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుందని గతంలో రూమర్స్ వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం చోటా బచ్చన్ తో కూడా విడిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే బచ్చన్ ఫ్యామిలీ కూడా అటెండ్ అయింది.

అయితే అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలు అందరూ ఒకేసారి కలిసి వస్తే... ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్య మాత్రం ఈవెంట్ కు సెపరేట్ గా వచ్చారు. దీంతో ఎప్పటి నుంచో వస్తున్న విడాకుల రూమర్స్ నిజమైనట్లే అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి వేరుగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ నీలి కళ్ల సుందరి.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

Advertisement

Next Story