Vishal అంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్

by sudharani |   ( Updated:2023-09-11 16:22:37.0  )
Vishal అంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా సినిమా ‘మార్క్ ఆంటోని’. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్.వినోద్ కుమార్ నిర్మించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఆదివారం విశాల్ ‘మార్క్ ఆంటోని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ అభినయ తన సంతోషాన్ని, భావాలను పంచుకుంది. ఈ మేరకు ‘‘మార్క్ ఆంటోనిలో నాకు మంచి పాత్రను ఇచ్చారు. నేరు ఇందులో విశాల్‌కు భార్యగా నటించాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. నాకు విశాల్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. అభినయ మాట్లాడలేదన్న సంగతి తెలిసిందే. ఆమె స్టేజ్‌పై మూగ సైగలతో తన భావాన్ని చెబుతుంటే.. కింద నుంచి ఆమె అసిస్టెంట్, ప్రాంప్టర్ తెలుగులో ఆ అర్థాన్ని వివరించింది.

ఇవి కూడా చదవండి :

పెళ్లైన హీరోలను ప్రేమించిన అగ్ర హీరోయిన్లు వీళ్లే.. పైగా సహజీవం కూడా చేసి!

సమంత to అనుష్క.. కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే!

Advertisement

Next Story