Vishal తో రిలేషన్‌పై స్పందించిన Abhinaya.. భార్యగా న్యాయం చేస్తానంటోంది..

by Shiva |   ( Updated:2023-09-02 15:55:55.0  )
Vishal తో రిలేషన్‌పై స్పందించిన Abhinaya.. భార్యగా న్యాయం చేస్తానంటోంది..
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో విశాల్‌తో రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది టాలీవుడ్ నటి అభినయ. విశాల్ హీరోగా వస్తున్న ‘మార్క్ ఆంటోనీ’లో ఓ కీలక పాత్ర పోషించిన ఆమె.. ఆసక్తికర విశేషాలు పంచుకుంది. ‘‘ప్రేమ చదరంగం’ మూవీ చూసినప్పటి నుంచి అతడిని ఇష్టపడుతున్నా. అయితే, ఆయనతో నాకు పెళ్లి జరిగిందని వార్తలొచ్చినపుడు చాలా షాక్ అయ్యాను. కొన్ని రోజులు బాధపడ్డాను. నిజానికి నాకు చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అంటే చాలా ఇష్టం.

ఆయన తర్వాత విశాల్‌నే అంతగా అభిమానిస్తా. జీవితంలో ఒక్కసారైనా అతన్ని కలవాలని కోరుకునేదాన్ని. ‘పూజ’ మూవీలో పని చేసే అవకాశం వచ్చినా విశాల్‌ను నేరుగా కలవలేకపోయా. కానీ, సినిమా షూట్‌లోనే ఫస్ట్ టైమ్ అతన్ని కలిసినపుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇన్నాళ్లకు మరోసారి ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇందులో ఆయన భార్యగా అందరినీ మెప్పిప్తా. నా కల నెరవేరిన రోజు ఎప్పటికీ మరిచిపోను’ అని తెలిపింది. ఇక ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి : మాల్దీవులకు చెక్కేసిన Thamannah,Vijay Varma ఆ పని చేశారా ..?

Advertisement

Next Story