‘ఆషికీ 3’లో కీలకంగా హీరోయిన్ పాత్ర

by Anjali |   ( Updated:2023-04-13 13:48:27.0  )
‘ఆషికీ 3’లో కీలకంగా హీరోయిన్ పాత్ర
X

దిశ, సినిమా: ‘ఆషికీ’ సీక్వెల్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 90లలో వచ్చిన ‘ఆషికీ’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో.. 2000లలో వచ్చిన ‘ఆషికీ 2’కు అంతే క్రేజ్ ఉంది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యంగ్ రాక్ స్టార్ కార్తీక్ ఆర్యన్‌ ఇప్పటికే హీరోగా ఫైనల్ కాగా.. హీరోయిన్ సెలక్షన్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నారు మేకర్స్. దీపికా పదుకొణే లేదా కత్రినా కైఫ్‌ను ఫైనలైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ సంక్లిష్టమైన పాత్ర కావడంతో కొత్త హీరోయిన్‌ను కాకుండా వీరిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. అనురాగ్ బసు దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది.

Also Read...

హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ : క్లారిటీ ఇచ్చిన రవిబాబు

Advertisement

Next Story