రీఎంట్రీపై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన అమీర్.. క్రిస్మస్‌కు బొమ్మ చూపిస్తాడట

by Anjali |   ( Updated:2023-08-30 06:47:17.0  )
రీఎంట్రీపై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన అమీర్.. క్రిస్మస్‌కు బొమ్మ చూపిస్తాడట
X

దిశ, సినిమా: ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు అమీర్ స్వీయ నిర్మాణ సంస్థ ‘అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌' పతాకంపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెబుతూ ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘నెక్ట్స్ మూవీని పట్టాలు ఎక్కించడానికి ఆమీర్ సిద్దమయ్యాడు. సొంత సినిమా నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 16గా కొత్త సినిమా రాబోతుంది. ఈ మూవీలో అమీర్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. 2024 జనవరి 20 నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ముహమూర్తం ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు’ అంటూ బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా అమీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story