- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నా భార్యకు మానవత్వం లేదు.. కూతురిని తలచుకుని కుమిలిపోతున్న అమీర్
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటుడు అమీర్ అలీ కూతురి కోసం కుమిలిపోతున్నట్లు తెలిపాడు. 2012లో సంజీదా షైఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా సరోగసి ద్వారా వీరికి కూరుతు 'ఐరా' పుట్టింది. అయితే దాదాపు తొమ్మిదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారం ఒక్కసారిగా తలకిందులైంది. కారణాలేంటో వెల్లడించకుండానే గతేడాది జనవరిలో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే డైవోర్స్ తర్వాత తన కూతురిని చూపించడానికి మాజీ భార్య నిరాకరిస్తుందంటూ తాజాగా కన్నీరు పెట్టుకున్న నటుడు.. 'నా వైవాహిక జీవితం కుప్పకూలిపోయింది.
నేను ఎంతగానో కుమిలిపోయాను. అయినా కఠిన పరిస్థితులను తట్టుకుని తిరిగి నిలబడ్డాను. మళ్లీ మామూలు మనిషిని అయ్యాను. నా కూతురిని కలిసేందుకు కొంతకాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. అయినా సంజీద కనికరించట్లేదు. నిజానికి నా తప్పేం లేకపోయినా నన్నే నిందించారు' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇదంతా చేస్తున్న తన మాజీ భార్యను ఇప్పటికీ గౌరవిస్తున్నానన్న అమీర్.. తనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలపడం విశేషం.
ఇవి కూడా చదవండి : భార్యపై భర్త జోకులు వేయొద్దా.. రణ్‌బీర్‌కు మద్దతుగా గౌహర్ ఖాన్