శేఖర్ మాస్టర్ సీక్రెట్స్ బయటపెట్టిన హైపర్ ఆది.. ఆ హీరోయిన్ నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-30 04:08:11.0  )
శేఖర్ మాస్టర్ సీక్రెట్స్ బయటపెట్టిన హైపర్ ఆది.. ఆ హీరోయిన్ నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్!
X

దిశ, సినిమా : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరో సినిమాలో తప్పకుండా కొరియోగ్రాఫర్‌గా ఈయన ఉండాల్సిందే. ఈయన వేసే స్టేప్స్‌తో థియేటర్స్‌లో ఊపు రావాల్సిందే. అంత బాగా కొరియోగ్రాఫీ చేస్తారు. అయితే శేఖర్ మాస్టర్ ఢీ డ్యాన్స్ షోకు జడ్జీగా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఢీ షోలో.. సీక్రెట్‌గా శేఖర్ మాస్టర్ మొబైల్ తీసుకున్న హైపర్ ఆది ఆయన బండారాలన్నీ బయటపెట్టాడు. ఆయన చాలా మంది హీరోయిన్స్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిపాడు అంతే కాకుండా భూమిక నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్ ఉన్నాయని, సదా , ప్రియమణి, పూర్ణ వంటి వారికి శేఖర్ మాస్ట్ కాల్ చేశాడంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. అంతే కాకుండా ఆయన రోజూ ఏం చేస్తాడో కూడా ఉంది, వాకింగ్, ట్రెకింగ్, ఇంకో ఇంగ్ అని ఉంది ఇది దేనికంటూ ఫన్నీగా పంచ్ వేసి అక్కడున్నవారిని నవ్వించాడు ఆది. అలాగే ఆది ఫోన్ శేఖర్ మాస్టర్ కొట్టేసి, ఆది రసిక రాణితో, జింగిడి జ్యోతితో కంటిన్యూగా చాట్ చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా, ఆది తన ఫోన్ లాగేసుకున్నాడు. ఇలా షేకర్ మాస్టర్, ఆది కామెడీ ఢీ షోకు హైలెట్‌గా మారడమే కాకుండా అందరి చేత నవ్వులు పూయించింది.

Advertisement

Next Story

Most Viewed