అందరూ చూస్తుండగా హాలీవుడ్ నటుడికి ముద్దులు పెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2024-08-13 11:27:25.0  )
అందరూ చూస్తుండగా హాలీవుడ్ నటుడికి ముద్దులు పెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
X

దిశ, సినిమా: పారిస్ ఒలంపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీన్ నదిలో మొదలయ్యాయి. జూలై 26న స్టార్ట్ అయి ఆగస్టు 11న ముగిశాయి. అయితే ఇందులో ఎన్నో సంచనాలు జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా నమోదైన రికార్డులు, చేజారిన పతకాలోన్నె క్రీడాకారుల నాలుగేళ్ల శ్రమకు సాక్ష్యంగా నిలిచాయి. ఇక ఈ క్రీడల ముగింపు వేడుకలు కూడా జరిగాయి. అయితే ఇందులో ఓ ఆసక్తికర ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అది పూర్తి చేసుకుని వేదిక నుంచి కిందకు దిగి బయటకు వస్తుండగా.. అభిమానులు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే.. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఓ మహిళ మాత్రం అందరూ చూస్తుండగానే అతన్ని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దులు పెట్టింది.

ఒక్కసారిగా ఆమె అలా చేయడంతో టామ్ క్రూజ్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయన నవ్వుతూ వెళ్లిపోయాడు. ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన వారు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అబ్బాయి కాబట్టి నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇక ఆ సెలబ్రిటీ ప్లేస్‌లో ఓ అమ్మాయి ఉండి ఫ్యాన్ అబ్బాయి అయి ఉంటే పెద్ద వివాదం జరిగి ఉండేది అని కామెంట్లు పెడుతున్నారు.

Read More..

BIRTHDAY GIFT : హీరోయిన్‌కు పడవ, ఆమె అభిమానులకు వంద ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

Advertisement

Next Story