ఆ పని చేసి వివాదాలను పుల్ స్టాప్ చెప్పిన Ram Charan & Upasana

by sudharani |   ( Updated:2023-08-26 09:36:48.0  )
ఆ పని చేసి వివాదాలను పుల్ స్టాప్ చెప్పిన Ram Charan & Upasana
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ జాతీయా అవార్డు దక్కించుకోవడంతో సోషల్ మీడియా వేదికగా బన్నీకి ప్రశంసలు జల్లు వెల్లువెత్తుతున్నాయి. సినీ తారలు, రాజకీయ నేతలు, అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీలో అందరూ అల్లు అర్జున్‌కి స్పెషల్ విషెస్ తెలియజేశారు. అయితే, రామ్ చరణ్ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందిస్తూ.. గుంపులో గోవింద అన్నట్టుగా విషెస్ తెలిపాడు. దీంతో రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా రామ్ చరణ్, ఉపాసన అల్లు అర్జున్‌కి ఇచ్చిన గిఫ్ట్‌తో ఆ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయింది. ఈ మేరకు ఓ స్పెషల్ బొకేను పంపుతూ.. ‘‘డియర్ బన్నీ.. కంగ్రాట్స్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటివి ఇంకా నీకు ఎన్నో రావాలి. వస్తాయి’’ అంటూ నోట్ రాశారు. ఈ స్పెషల్ నోట్ షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ సో మచ్.. టచింగ్’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరిస్‌లో అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది.

Also Read: నేషనల్ అవార్డు తర్వాత ఆ స్టార్ కమెడియన్‌తో బన్నీ స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా..?




Advertisement

Next Story