Salaar Movie: సలార్ మూవీ నుంచి బయటికొచ్చిన ఓ షాకింగ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదే?

by Prasanna |
Salaar Movie: సలార్ మూవీ నుంచి బయటికొచ్చిన ఓ షాకింగ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదే?
X

దిశ,వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 'కేజిఎఫ్' మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మొదటిసారి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

సలార్ లో కేవలం రెండు పాటలే ఉంటాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. కాగా ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఐటెం సాంగ్ లో ప్రభాస్ కనిపించడని అంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో 'సలార్' ప్రమోషన్స్ మొదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. కాగా రీసెంట్ గా విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన ప్రభాస్ సలార్ రెగ్యులర్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే సౌత్, నార్త్ లో ప్రభాస్ సలార్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయబోతున్నారని, డార్లింగ్ తో పాటు మరి కొందరు యాక్టర్స్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.



Next Story