అలా చేస్తుండగా నా ప్యాంటులో ఎలుక దూరింది: Amita Bachchan

by Hamsa |   ( Updated:2023-02-09 17:04:42.0  )
అలా చేస్తుండగా నా ప్యాంటులో ఎలుక దూరింది: Amita Bachchan
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు అమితా బచ్చన్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సీనిమాల్లో, పలు బుల్లితెర షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా పలు ఆసక్తికర పోస్ట్‌లతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. తాజాగా, అమితా బచ్చన్ 'దో ఔర దో పాంచ్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్ని వేషాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశాడు. '' 2+2+= 5 దో ఔర దో పాంచ్' సినిమా వచ్చి దాదాపే 43 ఏళ్లయింది. ఈ మూవీ షూటింగ్ ఎంత సరదాగా సాగిందో.. ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌నైతే అస్సలు మర్చిపోలేను. ఆ ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వెళ్లాను. అక్కడ సీటులో కూర్చున్న కాసేపటికే ఓ ఎలుక నా ప్యాంట్‌లో దూరింది'' అంటూ ఫన్నీ క్యాప్షన్ జత చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, దో ఔర దో పాంచ్' సినిమా 1980 ఫిబ్రవరి 8న విడుదలైంది. ఇందులో హేమమాలిని, ఖదీర్, ఓం ప్రకాశ్‌ తదితరులు నటించారు.

ఇవి కూడా చదవండి : ఈ పాపం ఎవరిది? పాము కాటుతో చిన్నారి మృతి ఘటనపై ఆర్ఎస్పీ సీరియస్

Advertisement

Next Story