తల్లిని కోల్పోయి.. ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి

by Naveena |
తల్లిని కోల్పోయి.. ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి
X

దిశ,రాజపేట: రాయగిరి రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయి, తలకు గాయం తగిలి ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రాజపేట మండలం నర్సాపురం గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉండి.. రాజపేట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉల్లోజు భావన పదవ తరగతి చదువుతున్నది. 21 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. తొందరగా కోలుకోవాలని పరీక్షలు రాయాలని గ్రామస్తులు ఆశిస్తున్నప్పటికీ గాంధీ ఆసుపత్రి ఐసీయు లో చికిత్స పొందుతున్నది. తలకు ఆపరేషన్ కాగా ఇప్పటివరకు కళ్ళు కూడా తెరవలేదని, కాళ్లు మాత్రమే కదిలించిందని బంధువులు తెలిపారు. పెద్ద మనసు చేసుకొని నిరుపేద కుటుంబానికి 7731912505 నెంబర్ కు ఫోన్ పే గాని గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed