Rajini Kanth ‘Jailer’ కు అరుదైన రికార్డ్.. Tollywood చరిత్రలో ఇదే First Time

by sudharani |   ( Updated:2023-08-23 15:47:36.0  )
Rajini Kanth ‘Jailer’ కు అరుదైన రికార్డ్.. Tollywood చరిత్రలో ఇదే First Time
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జైలర్’. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డబల్ సూపర్ హిట్‌గా దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే.. తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ. 13 కోట్ల మార్క్‌ని అందుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ. 40 కోట్ల షేర్‌ ఫ్రాఫిట్‌ను రాబట్టింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ చిత్రం తన సినిమాకు చేసిన బిజినెస్ కంటే రూ. 30 కోట్ల షేర్ అధికంగా రాబట్టడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక రకంగా ‘జైలర్’ సినిమా టాలీవుడ్‌లో ఈ రేంజ్ లాభాలను తీసుకొచ్చిన ఫస్ట్ మూవీగా రికార్డులకు ఎక్కింది. కాగా.. ‘జైలర్’ సినిమా రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : America లో సత్తా చాటుకుంటున్న Prabhas.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ‘Salaar’ Movie Tickets

Advertisement

Next Story