- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmaji : స్టార్ డైరెక్టర్ పేరుతో మోసం.. నటుడు బ్రహ్మాజీ ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల పేరుతో జరిగే మోసాలు ఎక్కువైపోతున్నాయి. సినిమాల్లో నటించాలనే ఇష్టంతో, ఇన్‌ట్రెస్ట్‌తో ఉన్నవాళ్లను ఈజీగా తమ ఉచ్చలో పడేసి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లను టార్గెట్ చేసుకుని.. నేను స్టార్ డైరెక్టర్ మేనేజర్‌ను, ఆ హీరో మేకప్ మ్యాన్‌ను అని చెప్పి.. సినిమా అవకాశాలు కావాలంటే ఇంత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను నమ్మిన కొందరు అమాయకులు వారు కోరినట్లు డబ్బులు ఇస్తున్నారు. తీరా సినిమా ఛాన్స్ రాకపోయోసరికి మోస పోయామని తెలుసుకుని బాధపడతారు. తాజాగా ఓ వ్యక్తి అదే విధంగా చేశాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మేనేజర్‌ను అని చెప్పి డబ్బులు అడుతుతూ మోసం చేస్తున్నాడట. ఈ విషయాన్ని నటడు బ్రహ్యాజీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఈ మేరకు మోసం చేస్తున్న వ్యక్తి నెంబర్ కూడా షేర్ చేస్తూ.. ‘‘అతడి పేరు నటరాజ్ అన్నాదురై.. లోకేష్ కనకరాజ్ మేనేజర్ అంటూ ఫోన్ చేస్తాడు. నెక్ట్ సినిమాలో ఓ రోల్ ఉంది. కాకపోతే ఆడిషన్ ఇవ్వాలి.. వారి ఇచ్చే క్యాస్టూమ్‌లోనే ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి డబ్బులు కట్టాలి. ఒక వేళ మీరు ఆడిషన్స్‌లో సెలక్ట్ అయితే డబ్బులు మళ్లీ రీఫండ్ అవుతుతాయి అని కాల్ చేస్తారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక దీనిపై డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది.
Read More: హీరో విశాల్ ఆరోపణలు.. కేసు నమోదు చేసిన సీబీఐ