Mahesh Babu కు నేను బాకీ పడ్డాను.. త్వరలోనే తీర్చేస్తా: S.J.Surya

by Anjali |   ( Updated:2023-09-12 13:53:42.0  )
Mahesh Babu కు నేను బాకీ పడ్డాను.. త్వరలోనే తీర్చేస్తా: S.J.Surya
X

దిశ, సినిమా: కోలీవుడ్ ‌స్టార్ దర్శకుడు ఎస్.జె సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన సూర్య దర్శకుడిగా మాత్రమే కాదు పలు చిత్రాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. తాజాగా ‘మార్క్ అంటోని’ అనే సినిమాలో నటించారు. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో త్వరలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘దర్శకుడిగా తమిళంలో అజిత్, విజయ్‌లకు బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇచ్చాను. అలాగే తెలుగులో పవన్ కల్యాణ్ గారికి ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాను. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయా. ఆయనకు నేను బాకీ పడ్డాను. త్వరలోనే ఆయనతో ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందిస్తా’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి : ఆ సినిమాలో విలన్ పాత్రలో మహేశ్ బాబు డైరెక్టర్.. కారణం ఇదే!

Advertisement

Next Story