Koratala Siva : దర్శకుడు కొరటాల శివకు భారీ షాక్

by Mahesh |   ( Updated:2024-01-29 15:03:22.0  )
Koratala Siva : దర్శకుడు కొరటాల శివకు భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్, కొరటాల శివ.. తన కథను కాపీ చేశాడని గతంలో కోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఆధారాలను రచయిత శరత్ చంద్ర రచయితల సంఘం‌కు అందించాడు. వాటిని పరిశీలించిన సంఘం నేతలు.. తమ నివేదికను నాంపల్లి కోర్టుకు పంపించారు.

దీంతో పూర్తిగా విచారించిన కోర్టు.. స్వాతి లో వచ్చిన తన కథల ఆదారంగానే శ్రీమంతుడు సినిమా తీశాడని నిర్ధారణకు వచ్చింది. దీంతో దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై కొరటాల శివ హైకోర్టును, ఆశ్రయించారు. కాగా అక్కడ కూడా తన కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాను తీశాడని.. రచయిత శరత్ చంద్ర ఆధారాలు సమర్పించాడు.

అలాగే ఈ కేసులో రచయితల సంఘం నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. దీంతో కొరటాల శివ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. కానీ అక్కడ కూడా అతనికి షాక్ తగిలింది. ఈ కేసులో తాము విచారణ జరపడానికి ఏమీ లేదని.. పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలి అంది. లేకుంటే తామే కొరటాల శివ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఆయన లాయర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

Read More..

ఆ హీరోయిన్ కారణంగానే నాగచైతన్య-శోభిత విడిపోయారా?

Advertisement

Next Story