ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక చెంపగిల్లి, ముద్దు పెట్టిన అభిమాని

by sudharani |   ( Updated:2023-10-31 15:10:06.0  )
ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక చెంపగిల్లి, ముద్దు పెట్టిన అభిమాని
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రణ్‌బీర్‌తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సాధారణంగా చాలామంది సెలబ్రిటీలకు ఎయిర్‌పోర్టులో ఊహించని షాక్‌లు తగులుతుంటాయి. తాజాగా రష్మికకు కూడా ఓ ఊహించని అనుభవం ఎదురైంది.

ఈ మేరకు రష్మిక ఎయిర్‌పోర్టు‌లో కనిపించగానే ఒక చిన్నారి అభిమాని వచ్చి ఆమె చేతిని పట్టుకుంది. దీంతో అక్కడే ఆగిపొయిన రష్మికను ఆ చిన్నారి బుగ్గలను గిల్లడమే కాకుండా అనంతరం రష్మిక బుగ్గపై ముద్దు కూడా పెట్టింది. దీంతో రష్మిక కళ్లు మూసుకొని సిగ్గుపడింది. తర్వాత వారికి ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా వారితో కలిసి ఫొటోలు దిగింది రష్మిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్ ఫిక్స్

Advertisement

Next Story