Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి బోరున ఏడ్చేసిన వీరాభిమాని.. బన్నీ మంచితనానికి ఫిదా అవుతోన్న జనాలు (వీడియో)

by Anjali |   ( Updated:2024-03-21 15:25:42.0  )
Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి బోరున ఏడ్చేసిన వీరాభిమాని.. బన్నీ మంచితనానికి ఫిదా అవుతోన్న జనాలు (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ హీరో అంటే పడి చచ్చేవారు కోట్లలో ఉన్నారు. ఈ హీరో ఏ ఈవెంట్లకు హాజరైన జనాల సందడి మామూలుగా ఉండదు. అయితే ఎంతోకాలం నుంచి బన్నీని ఎలాగైనా కలవాలనుకున్న ఫ్యాన్ తాజాగా హైదరాబాదులో అల్లు అర్జున్ ను కలిశాడు. ఒక్కసారిగా అభిమాన నటుడిని చూడగానే అతడు భావోద్వేగానికి గురై.. సంతోషంలో వెక్కి వెక్కి ఏడ్చాడు.

అల్లు అర్జున్ చేతులను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు. బన్నీ ఆ వ్యక్తిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని.. చేతులను పట్టుకుని ఓదార్చాడు. అతడితో ప్రేమగా మాట్లాడాడు. ఆయన చెప్పి ముచ్చట్లన్నీ పెషెన్సీతో విన్నాడు. ఆ తర్వాత తన ఫ్యాన్‍తో కలిసి ఫొటోలు దిగాడు. ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నువ్వు లక్కీ పర్సన్ వీ మామా అంటూ అతడిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

డై హార్డ్ ఫ్యాన్స్ ను కలిసినప్పుడు ఎమోషనల్ అవడం కామన్ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్‍ను అంత ఆప్యాయంగా పలకరించిన అల్లు అర్జున్‍ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఐకాన్ స్టార్ ది గొప్ప మనసని బన్నీని కొనియాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed