ఎయిర్‌పోర్టులో శ్రద్ధాకు ఊహించని షాక్ ఇచ్చిన యువకుడు.. ప్రపోజల్ వీడియో వైరల్

by samatah |   ( Updated:2023-08-03 11:49:08.0  )
ఎయిర్‌పోర్టులో శ్రద్ధాకు ఊహించని షాక్ ఇచ్చిన యువకుడు.. ప్రపోజల్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌కు ఓ అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు. తనను గాఢంగా ప్రేమిస్తున్నానంటూ పబ్లిక్‌లోనే ప్రపోజ్‌ చేసి నటిని ఆశ్చర్యానికి గురిచేశాడు. విషయానికొస్తే.. సినిమా షూటింగ్‌లో భాగంగా ఎక్కడికో వెళ్లడానికి రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చింది శ్రద్ధాకపూర్‌. అయితే ఆమెను చూడగానే ఓ అబ్బాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే నటి దగ్గరకు పరిగెత్తుకొచ్చిన సదరు యువకుడు.. తనదైన స్టైల్‌లో ఆమెను పొగిడేస్తూ మోకాళ్లపై ఉండి పూల బొకే అందించి ప్రపోజ్ చేశాడు. దీంతో తన పట్ల ఫ్యాన్‌ చూపుతున్న అభిమానానికి ఫిదా అయిపోయిన బ్యూటీ.. అతనికి షేక్ హ్యాండ్‌ ఇచ్చి ఫొటోలు దిగింది. ఇక ఇదే వీడియోలో హ్యూమా ఖురేషి కూడా కనిపించగా ఇదంతా అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. శ్రద్ధాకపూర్‌ ప్రవర్తన తీరు బాగుందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More: Kajal Aggarwal : పెళ్లైనా కాజల్‌ని వదలని స్టార్ డైరెక్టర్.. అలా టార్చర్ చేశాడా?

Advertisement

Next Story