- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ హీరో.. కారణం ఇదే..!
దిశ డైనమిక్ బ్యూరో: మాట్లాడేముందు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడాలి అని పెద్దలు చెబుతారు. మౌనేన కలహం నాస్తి అనే మాట ఎంత వాస్తవమో.. అన్ని అనర్ధాలకు మూలం అనాలోచితంగా మాట్లాడడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడితే ఆ తరువాత తలదించుకుని క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని అనడానికి ఉదాహరణ మెగా బ్రదర్ నాగబాబు.
ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు పోలీస్ పాత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే బాగోదు అని మాట్లాడారు. కాగా నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దీనితో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని గ్రహించిన నాగబాబు ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో తాను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడానని, ఆ మాటలు తాను వెనక్కి తీస్కుంటున్నాను.. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే తనని క్షమియించగాల్సిందిగా కోరారు. అలానే అవి యాదృచ్ఛికంగా వచ్చిన మాటలే కాని కావాలని అన్న మాటలు కాదని.. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024