టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే?

by Hamsa |   ( Updated:2024-05-03 06:02:03.0  )
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆయనపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. తన ఇంట్లో అద్దెకు ఉంటూనే రూ. 75 కోట్ల విలువైన ఇంటిని ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ.. హీరా గ్రూప్ సీఈఓ నోహీరా ఫిలిండనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన ఇంట్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

ఇంటిని ఖాళీ చేయమంటే తనని రౌడీలను తీసుకొచ్చి బెదిరిస్తున్నాడంటూ నౌహీరా ఆరోపించింది. గత కొద్ది కాలంగా అద్దె కూడా చెల్లించకుండా ఇంట్లోకి రానివ్వడం లేదు. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో ఇలా చేస్తున్నాడని నౌహీరా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఫిలింనగర్ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో వారు బండ్ల గణేష్‌పై ఐపీసీ 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story