- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరిస్తోన్న స్టార్ నటి ఐశ్వర్య భర్త.. జూబ్లీహిల్స్లో కేసు నమోదు!
దిశ, సినిమా: ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య గురించి సుపరిచితమే. ఈమె అమ్మాయి గారు, పలుకే బంగారమాయనే, అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించి.. మంచి గుర్తింపు దక్కించుకుంది. గతేడాది శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇంతకాలంగా ఎవరికీ తెలియని వీరి బంధం.. ఇటీవల ఐశ్వర్య-శ్యామ్ కాపురం నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.
అందుకు కారణం శ్యామ్ కుమార్ చేసిన ఆరోపణలే. తన భార్యకు రమేష్ బాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపించాడు. తన దగ్గర రూ.25 లక్షలు కాజేసి డివోర్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుందన్నాడు. కట్నం కూడా తీసుకోకుండా ఐశ్వర్యను వివాహం చేసుకున్నానని, కానీ కొన్ని రోజులకే ఈ నటి అసలు క్యారెక్టర్ బయటపడిందని తెలిపాడు.
ఇక రీసెంట్ గా రమేశ్ కు శ్యామ్ కుమార్ ఫోన్ చేసి 10 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఐశ్వర్యతో దిగిన పిక్స్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడట. మార్చి 12 న తన భార్యతో ఉండటం చూశానని, మార్చి నుంచి 14 వరకు ఆస్ట్రేలియాలో ఉన్నాడని శ్యామ్ నెట్టింట వైరల్ చేశాడు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి శ్యామ్ ప్రయత్నిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు రమేష్ బాబు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు శ్యామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.