- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara : నయనతారపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్న పూరణి’. నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వల్ల ‘అన్న పూరణి’ మూవీపై ఎలాంటి టాక్ రాలేదు. ఇక తాజాగా ఈమూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ.. పలు వివాదాలకు దారి తీస్తుంది.
అయితే.. ‘జీవితంలో ఒక లక్ష్యం.. పట్టుదల ఉంటే ఎలాంటి అవాంతరాలనైనా దాటుకుని అనుకున్నది సాధించవచ్చనే ఉద్దేశ్యంతో’ ఈ మూవీ తెరకెక్కించారు. కానీ, డైరెక్టర్ అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్లు అయింది. ఈ మూవీలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని మాజీ శివసేన నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నపూరణి సినిమాకు సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్, హీరోయిన్ నయనతార, అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇలా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.
- Tags
- Nayanthara