- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రైన దగ్గుబాటి హీరో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య
దిశ, సినిమా: ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ అంటే ఎంత గౌవరం, మర్యాద ఉందో అందరికీ తెలిసిందే. తగాదాలకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ మంచి ఫ్యామిలీ అనిపించుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ ఇంట సంబరాలు జరుగుతున్నట్లు సమాచారం. సురేష్ బాబు చిన్న కొడుకైన అభిరామ్ దగ్గుబాటి తండ్రి అయ్యాడు. అభిరామ్ భార్య ప్రత్యూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీరి ఇంట సంతోషాలు వెదజల్లుతున్నాయి. అయితే అభిరామ్ లాస్ట్ ఇయర్ తమ దగ్గర బంధువైన ప్రత్యూష అనే అమ్మాయిని శ్రీలంకలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వివాహ అనంతరం వీరి రిసెప్షన్‌ను హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా జరిపించారు. అయితే రానా తర్వాతే అభిరామ్ పెళ్లి చేసుకున్నప్పటికీ.. తండ్రిగా మాత్రం ముందే ప్రమోషన్ పొందాడు.
ఇక అభిరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘అహింస’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ హీరోగా అంతగా రాణించలేకపోయాడు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్స్‌ను చూసుకుంటున్నాడని సమాచారం.