‘ఎన్నికల హామీలను మర్చిపోయారు’.. కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా ఫైర్!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-27 15:49:28.0  )
‘ఎన్నికల హామీలను మర్చిపోయారు’.. కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా ఫైర్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల(Electricity charges) పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ(YSRCP) ఆరోపించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా(Former Minister Roja) ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.

ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్‌లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ లేదు అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇచ్చిన హామీ ఏమైంది? అని ఆమె ప్రశ్నించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి రోజా తేల్చి చెప్పారు.


Read More..

AP Govt:బీసీ మహిళలు, యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Advertisement

Next Story

Most Viewed